Prema Desam Movie Lauch ప్రేమ దేశం మూవీ లాంచ్

Filmibeat Telugu 2018-06-20

Views 88

Ajay Kuturva, Maya starrer Prema Desam Movie Lanched today at Rama Naidu Studio. Akash Puri gave the first clap while Aanad ranga switched on the camera. The movie Produced by Sireesha, Directed by Srikanth Sidhdham.


మెహబూబా సినిమాతో హీరోగా మారిన ఆకాష్ పూరి.... తొలి సినిమాతోనే సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆకాష్ పూరి చేతుల మీదుగా ప్రేమ దేశం అనే కొత్త సినిమా లాంచ్ అయింది. అజ‌య్ క‌తుర్‌వా, మాయ‌, శివ‌కుమార్ రామ‌చంద్ర‌వ‌ర‌ప, వ్యాస‌కి, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్నారు. సిరి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శిరీషా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంజా ఫేం నీలిమా తిరుమలశెట్టి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆకాష్ పూరి తొలి సన్నివేశానికి క్లాప్ కొట్ట‌ారు. ఆనంద్ రంగ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
ఆకాష్ మాట్లాడుతూ - అజ‌య్ నాకు మంచి మిత్రుడు. ఇద్ద‌రం క‌లిసి సినిమాలు చేశాం. త‌న‌కు ఈ సినిమా హీరోగా మంచి పేరు తేవాలి. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం అంటే సినిమా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు అన్నారు. హీరో అజ‌య్ మాట్లాడుతూ - పూరిగారు న‌టుడిగా నాకు బ్రేక్ ఇచ్చారు. డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీ. కొత్త కాన్సెప్ట్‌తో సాగుతుంది అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS