'విజేత' మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్

Filmibeat Telugu 2018-06-27

Views 2

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా పరిచయం చేస్తూ సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'విజేత'. మాళవికా నాయర్ హీరోయిన్. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌ సంగీతం అందించారు. ఆడియో వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ‌, రాజ‌మౌళి, అల్లు అర‌వింద్‌, ఎం.ఎం.కీర‌వాణి, సాయికొర్ర‌పాటి, క‌ల్యాణ్ దేవ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌, సెంథిల్‌కుమార్ స‌హా ఇత‌ర‌ చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.... చిరంజీవిగారు మంచి డాన్సర్, మంచి ఫైటర్, మంచి యాక్టర్ అని అందరికీ తెలుసు. ఆయనకు ఉన్న స్పెషల్ స్కిల్ స్టోరీ జడ్జ్ చేయడం, ఈ విషయం ఇండస్ట్రీ వారికి మాత్రమే తెలుసు. ఆయన స్టోరీ విన్న వెంటనే అందులో ఏం తప్పులు ఉన్నాయి, ఎలాంటి కరెక్షన్స్ చేయాలి, దేన్ని హైలెట్ చేయాలి, దేన్ని తగ్గించాలనేది చెబుతారు. ఈ విషయంలో ఆయన్ను మించిన జడ్జి లేరు అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS