నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయిలో దారుణం జరిగింది. ఓ ఎంపీపీ మహిళను కాలితో తన్నాడు. స్థలం విషయంలో ఈ గొడవ జరిగింది. ఓ కుటుంబానికి, ఎంపీపీకి మధ్య ఘర్షణ జరిగింది. బాధిత మహిళ ఏదో చెబుతుండగా ఎంపీపీ అందరూ చూస్తుండగా కాలితో తన్నాడు. స్థలం రిజిస్ట్రేషన్ అనంతరం ఎంపీపీ అదనంగా డబ్బులు అడిగాడని బాధితురాలైన గౌరారం వాసి రాజవ్వ ఆరోపించారు. దీంతో ఆమె తమ బంధువులతో ఎంపీపీ ఇంటి ముందు నిరసనకు దిగింది. ఎంపీపీతో వారు వాగ్వాదానికి దిగారు.