Mahesh and Kiara Advani birthday wishes to Koratala Siva. Koratala Siva became crazy director with only 4 movies
దర్శకుడు కొరటాల జన్మదినం నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన కొరటాల మిర్చి చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారారు. ప్రభాస్ నటించిన మిర్చి చిత్రం ఘనవిజయం సాధిచింది. ఆ తరువాత వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ విజయాల్ని సొంతం చేసుకున్న కొరటాల టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా మారిపోయారు. ఆయన దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు.
భారత అనే నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ భామ కైరా అద్వానీ. తనకు పరిచయ చిత్రంతోనే ఘనవిజయం అందించిన దర్శకుడికి కైరా బర్త్ డే విషెష్ తెలియజేసింది. ఈ సందర్భంగా కొరటాలని ప్రశంసలతో ముంచెత్తింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కొరటాల శివకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో రెండు అద్భుతమైన చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు చిత్రం రికార్డులని తిరగరాయగా, భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది.