Chiranjeevi'S Next Movie With Koratala Siva

Filmibeat Telugu 2018-05-28

Views 685

Chiranjeevi is set to join hands with Koratala Siva, who is now basking in the success of his film Bharat Ane Nenu, which has Mahesh Babu in the lead role. Earlier, there were reports that Ram Charan and Koratala Siva will team up for a film. However, since the actor is busy with SS Rajamouli's film RRR, the project has been postponed.

సైరా చిత్రం తర్వాత మెగాస్టార్ నటించబోయే చిత్రం ఏమిటనే అంశంపై సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి చిత్రం వచ్చి ఏడాదికిపైగా పూర్తయింది. సైరా రిలీజ్ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. సైరా పూర్తి చేయడానికి ముందే చిరంజీవి మరో సినిమాను ప్రారంభించే విషయంపై దృస్టిపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
సైరా నర్సింహారెడ్డి చిత్రం తర్వాత దర్శకుడు కొరటాల శివతో చిరంజీవి జత కట్టనున్నట్టు సమాచారం. రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంగా తెరకెక్కే ఈ చిత్రానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల చిరంజీవి, కొరటాల శివ కథా చర్చలు జరిపినట్టు తెలిసింది. కొరటాల శివ చెప్పిన కథకు చిరంజీవి సంతృప్తి చెందినట్టు సమాచారం.
వాస్తవానికి కోరటాల శివతో రాంచరణ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో చెర్రీ బిజీగా ఉండటం, ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి సినిమా కూడా చేయాల్సి ఉండటంతో శివతో జత కట్టే విషయాన్ని రాంచరణ్ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవితో సినిమా ఫిక్స్ చేసినట్టు తెలిసింది.
కొరటాల శివతో సినిమా నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సైరా నర్సింహారెడ్డి బయోపిక్‌ను పూర్తి చేసేందుకు చిరంజీవి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాతగా మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడిగా సురేందర్ రెడ్డి వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Share This Video


Download

  
Report form