Bigg Boss Season 2 Telugu : First Luxury Budget Task

Filmibeat Telugu 2018-06-14

Views 898

Bigg Boss 2 Telugu Day 4 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.
#BiggBoss2
#BiggBoss

బిగ్ బాస్ రెండో సీజన్ రోజులు గడుస్తున్న కొద్దీ ఆసక్తికర టాస్క్‌లతో ముందుకు సాగుతోంది. యజమానుల టీం సేవకుల టీంతో తమ పనులు చేయించుకోవడంతో పాటు ప్రేక్షకలను వినోదం పంచేందుకు జంబలకిడి పంబ బ్యూటీ పజెంట్ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో భాగంగా సేవకుల టీం సభ్యుల్లో ఆడవారు మగవేషాల్లో, మగవారు ఆడ వేషాల్లో ర్యాంప్ షో నిర్వమించారు.
జంబలకిడి పంబ ఫ్యాషన్ షోలో పాల్గొన్న టీవీ 9 యాంకర్ దీప్తి నల్లమోతు పవన్ కళ్యాణ్ మాదిరిగా డైలాగులు కొట్టి ఆకట్టుకుంది. ‘ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు.. కానీ గుండెల్లో కావాల్సినంత ధైర్యం ఉంది' అంటూ ఆమె అదరగొట్టారు.
ఇక మిగిలిన సేవకుల కంటెస్టెంట్స్ ‘జంబలకిడి పంబ’ టాస్క్‌లో రెచ్చిపోయి పెర్ఫామెన్స్ చేశారు. ముఖ్యంగా రోల్ రైడా చీరకట్టి పెదాలకు లిప్ స్టిక్ పెట్టి వయ్యారాలు ఒలకపోసాడు. అలానే నూతన్ నాయుడు విశాలచ్చిమిగా ఇరగదీసే పెర్ఫామెన్స్ ఇచ్చారు. దీంతో నూతన్ నాయుడినే బెస్ట్ పెర్ఫామర్‌గా ఎంపిక చేశారు యజమానులు.

Share This Video


Download

  
Report form