Date fix for SyeRaa first look. RamCharan wants to release first look on Megastar's birth day
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో తారాస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సైరా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆ ముహూర్తం రానే వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సైరా ఫస్ట్ లుక్ తో ఫాన్స్ ని ఖుషి చేయాలనీ రాంచరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా అంగీకారం తెలిపాడట.
తెల్లవారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన వీర గాధని సైరా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి లుక్ లో మెగాస్టార్ చిరంజీవి ఎలా ఉంటాడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.