Sri Reddy Sensational Comments On Bigg Boss Telugu 2

Filmibeat Telugu 2018-06-05

Views 1.8K

SriReddy sensational comments on Bigg Boss Telugu 2. Nani will going to host this show

సంచలన నటి శ్రీరెడ్డి మరో మారు వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో కావలసినంత పబ్లిసిటీ పొందిన శ్రీరెడ్డి మీడియాలో హల్ చల్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించి ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్న మీడియా, దాని వెనుక ఉన్న కుట్ర దారులకు పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దీనితో శ్రీరెడ్డి వార్తల ప్రసారాలని సదరు సంస్థలు నిలిపివేశాయి. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి మరో మారు లైమ్ లైట్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ షో, ఆ షోకి హోస్ట్ గా మారబోతున్న నేచురల్ స్టార్ నాని టార్గెట్ గా శ్రీరెడ్డి కామెంట్స్ మొదలు పెట్టింది.
బిగ్‌బాస్‌ షో దేశవ్యాప్తంగా విజయవంతం అయిన బుల్లి తెర రియాలిటీ షో. తెలుగులో తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రెండవ సీజన్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. జూన్ 10 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షోలో మొత్తం 16 మంది సభ్యులు పాల్గొనబోతున్నారు.
ఆ మధ్య సోషల్ మీడియాలో బిగ్‌బాస్‌ లో పాల్గొనబోయే పార్టిసిపెంట్స్ గురించి ఓ ప్రచారం జరిగింది. ఈ సీజన్ లో శ్రీరెడ్డి కూడా పాల్గొనబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని తేలింది.
శ్రీరెడ్డి గతంలోనే నానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికి నాని గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూనే ఉంది.
తాజగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నాకు, నానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏం చెద్దాం రా నాని అని ట్వీట్ చేసింది.

Share This Video


Download

  
Report form