Vadivelu Asked By Producers To Return Remuneration

Filmibeat Telugu 2018-05-26

Views 2K

Members of the Producers Council met Vadivelu to sort out the issues. However, the meeting did not turn out as expected. Vadivelu is said to have asked the production house to settle a remuneration of Rs 1 crore to resume shooting for Imsai Arasan 24am Pulikecei. The council has now issued an ultimatum to Vadivelu. They've asked him to work in the film without any condition or he should compensate the loss by paying a sum of Rs 9 crore that has been incurred so far by the production house.
#Vadivelu

మెడియన్‌గా రాణిస్తున్న తరుణంలో హింసించే రాజు 23వ పులకేసి చిత్రంలో వడివేలుకు హీరోగా శంకర్ అవకాశం ఇచ్చారు. ఆ చిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం తర్వాత వడివేలు సోలో హీరోగా కొన్ని చిత్రాలు చేశారు. దానికి సీక్వెలుగా వస్తున్న 24వ పులకేసిలో మళ్లీ హీరోగా నటించే అవకాశం ఇవ్వగా అది వివాదంగా మారింది.
తాను రూపొందించే సినిమా ఆలస్యం కావడం వల్ల తాను ఎంతో నష్టపోయానని తమిళ నిర్మాతల సంఘానికి ప్రముఖ నిర్మాత శంకర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో హింసించే రాజు 24వ పులకేసి చిత్రం షూటింగ్‌కు వెంటనే హాజరుకావాలని నిర్మాతల మండలి షరతు విధించింది. అలాగే బేషరతుగా షూటింగ్‌కు హాజరుకావాలని, అలాగే స్క్రిప్టులో జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది.
హింసించే రాజు 24వ పులకేసి చిత్ర వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు తాజాగా తమిళ నిర్మాతల మండలిని వడివేలు కలిశారు. అయితే మండలితో వడివేలు భేటి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని సమాచారం.
అంతేకాకుండా చిత్రానికి ఇవ్వాల్సిన కోటి రూపాయల రెమ్యునరేషన్‌ను నిర్మాత చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వడివేలు సూచించడంపై నిర్మాత మండలి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వడివేలుకు మండలి అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది.

Share This Video


Download

  
Report form