Top-order batsman Devon Smith has been recalled to the 13-man West Indies squad after a gap of three years for the three-match Test series against Sri Lanka, beginning June 6 at the Queens Park Oval here.
మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాపార్డర్ బ్యాట్స్‌మెన్ డెవోన్ స్మిత్ వెస్టిండిస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెలలో శ్రీలంక మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం విండిస్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ టెస్టు సిరిస్ కోసం విండిస్ బోర్డు 13 మంది సభ్యులతో కూడిన టెస్టు జట్టుని ప్రకటించింది.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జూన్ 6న ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరగనుంది. ఈ టెస్టు సిరిస్‌కు వెస్టిండిస్ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్‌కు బాధ్యతలు అప్పగించారు. మూడేళ్ల విరామం తర్వాత డెవోన్ స్మిత్‌కు బోర్డు పిలుపు రావడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
అయితే, ఈ ఏడాది నాలుగో రోజుల దేశవాళీ టోర్నమెంట్‌లో విండ్‌వర్డ్ ఐస్‌లాండ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన డెవోన్ స్మిత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 84.23 యావరేజితో మొత్తం 1095 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి.
36 ఏళ్ల డేవాన్ స్మిత్ చివరిసారిగా తన టెస్టు మ్యాచ్‌ని సెయింట్ జార్జెస్ పార్కులో ఏప్రిల్ 2015న ఇంగ్లాండ్‌తో ఆడాడు. ఛైర్మన్ ఆఫ్ సెలక్టర్లు కోర్ట్నీ బ్రౌన్ మాట్లాడుతూ 'న్యూజిలాండ్ పర్యటన అనంతరం అద్భుతమైన టెస్టు జట్టుని ఎంపిక చేశాం. డెవోన్ స్మిత్ విషయానికి వస్తే ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడి రాకతో జట్టులో టాపార్డర్ బ్యాటింగ్ ప్రదర్శన మెరుగవుతుందని భావిస్తున్నాం' అని అన్నాడు.