Buttler Recalled To England Test Squad

Oneindia Telugu 2018-05-16

Views 134

Jos Buttler has been included in England's Test squad to face Pakistan in a two-match series starting later this month, while rookie spinner Dom Bess has earned a surprise maiden call-up.
#Cricket
#England
#ICCTest
#JosButtler

దాదాపు ఏడాదిన్నర తర్వాత జోస్ బట్లర్‌కు సెలక్టర్లు టెస్టు క్రికెట్ ఆడే అవకాశం కల్పించారు. లార్డ్స్‌లో పాకిస్థాన్‌తో మే 24 నుంచి జరుగనున్న తొలి టెస్టు కోసం ఎంపిక చేసిన 12 మంది సభ్యుల జట్టులో బట్లర్‌ చోటు దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో అతను వికెట్‌కీపర్‌గా కాకుండా రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతాడు. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్‌ సిరిస్‌లో జేమ్స్‌ విన్స్‌ విఫలమవడంతో అతని స్థానాన్ని సెలక్టర్లు జోస్ బట్లర్‌తో భర్తీ చేశారు. అంతకముందు కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా జట్టులో స్థానం పొందిన బట్లర్‌ మిడిలార్డర్‌లో ఆశించినంతగా రాణించలేదు.
అయితే, ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న జోస్ బట్లర్‌ వరుసగా ఐదు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీంతో సెలక్టర్లు బట్లర్‌ను టెస్టుల్లోకి మళ్లీ తీసుకునేందుకు సరైన సమయంగా భావించినట్లు సెలక్టర్లు ప్రకటించారు.
కొత్తగా ఆఫ్‌ స్పిన్నర్‌ డొమినిక్‌ బెస్‌కు కూడా అవకాశం కల్పించారు. వన్డేలు, టి20ల్లో రెగ్యులర్‌ సభ్యుడైన జోస్ బట్లర్‌ ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరుపున 18 టెస్టులాడాడు. లార్డ్స్ వేదికగా జరిగే తొలి టెస్టుకు సంబంధించిన 12 మంది సభ్యులతో కూడిన ఇంగ్లాండ్‌ జట్టును మంగళవారం ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS