A sensation 95-run knock from 60 balls proved vital in keeping Rajasthan Royals alive in the Indian Premier League as Chennai Super Kings’ quest to qualify for the playoffs would have to wait for a little while longer.
తన భార్య చూస్తుండగా మ్యాచ్‌ని గెలిపించడం చాలా ఆనందంగా ఉందని ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న జోస్ బట్లర్ వెల్లడించాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 95 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. అనంతరం జోస్ బట్లర్ మాట్లాడుతూ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ అని, భార్య చూస్తుండగా గెలుపొందడం ఆనందంగా ఉందని చెప్పాడు.
'సాధారణంగా నేను మిడిలార్డర్‌లో వచ్చేవాడిని. ఇప్పుడు ఓపెనర్ పాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నా. బ్యాటింగ్ ఆర్డర్‌లో నన్ను టాపార్డర్‌లో దించాలన్నది కోచ్ షేన్ వార్న్ నిర్ణయం. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా. చెన్నైపై ఆడటం అంతసులువేమీకాదు. చివరిదాకా నిలబడి, జట్టును గెలిపించడం ఆనందంగా ఉంది' అని బట్లర్ తెలిపాడు.
ఐపీఎల్ కెరీర్‌లో ఇది(60 బంతుల్లో 95) నా బెస్ట్ ఇన్నింగ్స్. ప్రస్తుతం నా భర్య ఇండియాలోనే ఉంది. అత్తమామలు, కజిన్ కూడా తనతో మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఆమె ముందు ఈ ఇన్నింగ్స్ ఆడటం, గెలవడం మరిచిపోలేని అనుభూతి. ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీ ఐపీఎల్. ఇక్కడ క్రికెట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది' అని అన్నాడు.
శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్స్ రేసులో ఆశలను సజీవంగా ఉంచుకుంది.
రాజస్తాన్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ (95 నాటౌట్; 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.