The All-India Senior Selection Committee met in Bengaluru today to pick the Indian Cricket Team for the upcoming Paytm Test against Afghanistan, two-match T2OI series against Ireland, three-match T20I series against England and the three-match ODI series against England.
ఐపీఎల్ అనంతరం టీమిండియాను విదేశీ పర్యటనకు సంసిద్ధం చేస్తుంది బీసీసీఐ. ఈనేపథ్యంలోనే ఐర్లాండ్‌కు వెళ్లనున్న జట్టును తేదీ తదితర వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ పర్యటనకు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా జట్టు 11 ఏళ్ల తరువాత మళ్లీ ఐర్లాండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఐర్లాండ్‌తో రెండు టీ-20 మ్యాచ్‌ల నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది.
ఐర్లాండ్ దేశ రాజధాని డబ్లిన్‌లో జూన్ 27, 29 తేదీల్లో జరగనున్న రెండు టీ-20 మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, భారత్ జట్లు తలపడనున్నాయి. అదే టీమిండియా జట్టు ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లోనూ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా జట్టు వివరాలను వెల్లడించింది.