Yesterday (May 6, 2018) Sonam Kapoor got her mehendi done and today the entire Kapoor clan has gathered at BKC to celebrate the 'mehendi' ceremony of the would-be bride. We have got our hands on the first picture of Sonam Kapoor for the special night and she's looking nothing less than a Queen!
#SonamKapoor
#mehendi
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి మే 8న జరుగబోతున్న సంగతి తెలిసిందే. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాను సోనమ్ పెళ్లాడబోతోంది. ఈ వేడుక కంటే ముందు జరిగే మెహందీ, సంగీత్ పార్టీలు ముంబైలో గ్రాండ్‌గా జరిగాయి. మెహందీ సెర్మనీలో వధువు సోమన్ కపూర్ అదిరిపోయే లుక్‌లో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక ఈ వేడుకలో జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల ఈ సెలబ్రేషన్స్‌కు హాజరై సందడి చేశారు. కాగా, పలువురు అభిమానులు శ్రీదేవి లేని లోటు ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
మెహందీ వేడుకలో కొత్త పెళ్లి కూతురు సోమన్ కపూర్ గోల్డ్ లెహంగా ధరించి స్టన్నింగ్ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది.
సోదరి వివాహ వేడుకలో జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ తమ స్టన్నింగ్ లుక్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
కూతురు సోనమ్ కపూర్ పెళ్లి వేడుకలో అనిల్ కపూర్ స్పెషల్ లుక్‌తో ఆకట్టుకున్నారు.
సోనమ్ కపూర్ మెహందీ వేడుకలో ఆమె సోదరుడు హర్షవర్ధన్.
సోనమ్ కపూర్ మెహందీ వేడుకలో మోహిత్ మార్వా, అంతర. ఇటీవలే వీరి వివాహం దుబాయ్ లో జరిగింది. ఆ సమయంలోనే శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే.
సోనమ్ కపూర్ మెహందీ వేడుకలో ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.
సోనమ్ కపూర్ మెహందీ వేడుకలో నటిస్వర భాస్కర్.
సోనమ్ కపూర్ మెహందీ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలు.
సోనమ్ కపూర్ మెహందీ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి.
సోనమ్ కపూర్ మెహందీ, సంగీత్ వేడుక సందడి సందడిగా సాగింది.