Jhanvi Kapoor Want To Marry Vijay Devarakonda? | విజయ్ దేవరకొండ తో పెళ్లి కి బాలీవుడ్ హీరోయిన్‌ సై?

Filmibeat Telugu 2019-01-04

Views 2.7K

Were there heroes that you crush over and want to marry? Jhanvi kapoor replied that It's Vijay Devarakonda, You know that song inkem inkem kavali i have listened to it on repeat. says Jhanvi kapoor
#Jhanvikapoor
#VijayDevarakonda
#inkeminkemkavalisong
#bollywood
#crush

విజయ్ దేవరకొండ... 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో అమ్మాయిల ఫేవరెట్ అయిపోయాడు. చాలా మంది అతడి మాయలో పడిపోయారు. వీరిలో సాధారణ అమ్మాయిలు మాత్రమే కాదు... దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ కూడా ఉన్నారు.గతంలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన హిందీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో జాహ్నవి కపూర్... 'ఏదైనా ఒక రోజు మేల్ యాక్టర్‌గా నిద్రలేవాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు'... అనే ప్రశ్నకు ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఓ వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మరోసారి జాహ్నవి కపూర్ నోట విజయ్ దేవరకొండ మాట వినిపించింది. ఏ హీరోను చూస్తే మీకు క్రష్ కలుగుతుంది, పెళ్లి చేకోవాలనిపిస్తుంది? అనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ అని జాహ్నవి తెలిపారు.
గీత గోవిందం' చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలి సాంగ్ తనను మాయ చేసిందని, ఆ పాట చాలా సార్లు రిపీటెడ్‌గా విన్నాను అని జాహ్నవి చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి ఆమె విజయ్ దేవరకొండ సినిమాలను ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS