IPL 2018: Sunrisers Hyderabad Vs Royal Challengers Bangalore Match Preview

Oneindia Telugu 2018-05-07

Views 33

A consistent Sunrisers Hyderabad unit would look to consolidate its position at the top of the points table while Royal Challengers Bangalore will fight for survival when they clash in the Indian Premier League (IPL) tie here on Monday (May 7). Courtesy their splendid bowling attack, SRH emerged as good defenders initially but by defeating Delhi Daredevils with a seven-wicket margin on Saturday (May 5), they proved that they can pull off tight chases as well.


ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ చల్లేన్గేర్స్ బెంగుళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 12 పాయింట్లతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకో 2, 3 విజయాలు సాధిస్తే సన్‌రైజర్స్‌ దాదాపుగా నాకౌట్లో అడుగుపెట్టినట్లే. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని కొనసాగించాలనే హైదరాబాద్ భావిస్తోంది.
నిజానికి ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. మిగతా జట్లతో పోలిస్తే బౌలింగ్ ప్రధానం బలంగా విజయాలను రాబడుతోంది. ప్రత్యర్ధి జట్లకు స్వల్ప లక్ష్యాలను నిర్దేశించి విజయాలు సాధిస్తోన్న తీరు నిజంగా అద్భుతం. హైదరాబాద్ బ్యాటింగ్‌లో హిట్టర్లు, భారీ పరుగులు కనిపించకుండానే జట్టు విజయాలతో దూసుకెళ్తోంది.
ఐపీఎల్ 11వ సీజన్‌లో అంతగా రాణించలేకపోతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఓడి ప్లే ఆఫ్‌ ఆశలను మరింత సంక్షిష్టం చేసుకున్న ఆర్సీబీ ఎలాగైనా తన సత్త్హ చాటడానికి చూస్తుంది.

Share This Video


Download

  
Report form