IPL 2018: Rajasthan Royals vs Sunrisers Hyderabad Highlights

Oneindia Telugu 2018-04-30

Views 2

On a hot day at the Sawai Mansingh Stadium in Jaipur, the Sunrisers Hyderabad bowlers once again pulled off a thrilling victory as they breached the Rajasthan Royals’ fortress, defeating them by 11 runs. The Sunrisers who had earlier put on a total of 151, defeated the Royals and climbed to the top of the table on Sunday (April 29). This is the third time in a week where the batting has been meagre, but the bowlers have been exceptional for the Hyderabad outfit.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ బౌలర్లు ఆద్యంతం తమ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. రాజస్థాన్‌ బౌలర్లు పరుగులు నియంత్రించడంతో పాటు ఎంతో క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ వేశారు. ఒక్క ఎక్స్‌ట్రా కూడా ఇవ్వకుండా నియంత్రణతో కూడిన బౌలింగ్ వేశారు.
అయితే ఆఖరి ఓవర్‌లో చివరి బంతికి ఎక్స్‌ట్రా రావడంతో ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క అదనపు పరుగు వచ్చినట్లయ్యింది. అది కూడా బై రూపంలో రావడంతో అసలు ఎక్స్‌ట్రా లేకుండా ఇన్నింగ్స్ ముగుస్తుందనుకున్న అభిమానికి నిరాశే ఎదురైంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 20 ఓవర్ల బౌలింగ్‌లో ఒకే ఒక్క ఎక్స్‌ట్రా రావడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 11 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. హైదరాబాద్‌ తక్కువ స్కోరు చేసినప్పటికీ, బౌలర్లు మరోసారి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (43 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలెక్స్‌ హేల్స్‌ (39 బంతుల్లో 45; 4 ఫోర్లు) రాణించారు.
#Rajasthan royals
#Sunrisers hyderabad
#Jaipur
#Kane Williamson

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS