Puri Jagannadh about movie with Mahesh Babu. He is ready to do another hero
#Puri Jagannadh
#MaheshBabu
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజగా చిత్రం మెహబూబా. తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని పూరి తెరకెక్కించారు. ఈ నెల 11 న మెహబూబా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూరిజగన్నాథ్ మహేష్ బాబుతో తలపెట్టిన జన గణ మన చిత్రం గురించి మాట్లాడారు. మహేష్ బాబు ఏవిషయం తేల్చడం లేదని అన్నారు. ఒక వేళ మహేష్ బాబు అంగీకరించకపోయినా ఆపేది లేదని మరో హీరోతో చేసితీరుతానని పూరి జగన్నాథ్ అన్నారు.
ఇటీవల జరుగుతున్న అత్యాచార ఘటనలు, దేశం ఏ వైపు నడుస్తోంది వంటి అంశాలతో ఈ చిత్రం ఉంటుందని పూరి జగన్నాథ్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోరికి చిత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తే, బిజినెస్ మాన్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.