Ramcharan Starts A New Movie With Boyapati Srinu

Filmibeat Telugu 2018-05-04

Views 1.3K

RamCharan completes big fight sequence in RC12. Boyapati Srinu directing this movie
#RamCharan
#BoyapatiSrinu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మంచి జోరు మీద ఉన్నాడు. రంగస్థలం చిత్రం బాహుబలి తరువాత టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగానే కాదు నటన పరంగా కూడా రాంచరణ్ ని ఈ చిత్రం మరో లెవల్ లో నిలబెట్టింది. రంగస్థలం విజయం అందించిన ఉత్సాహంతో వెంటనే బోయపాటి చిత్రంలో చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రం సంబందించిన తాజా అప్డేట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
రాంచరణ్ లేకుండానే బోయపాటి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించడం విశేషం. రాంచరణ్ ఈ చిత్రం కోసం సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. ఇటీవలే చరణ్ కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఇంటర్వెల్ ముందు వచ్చే భారీ ఫైట్ ని చరణ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. స్టంట్ కొరియోగ్రాఫర్ కనల్ కణ్ణన్ నేతృత్వంలో చిత్రీకరించిన ఈ ఫైట్ అద్భుతంగా వచ్చిందని సమాచారం.
బోయపాటి శ్రీను చిత్రాలు మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ చిత్రం కూడా అదేవిధంగా యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉండేలా చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. వివేక్, రాంచరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉంటాయని, విలన్ గా వివేక్ అద్భుతమైన నటన కనబరుస్తునట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ ఇటీవలే మహేష్ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి చిత్రంతోనే కైరా ఘన విజయం సొంతం చేసుకుంది.

Share This Video


Download

  
Report form