Ram Charan wants to reshoot some scenes of Boyapati film. After Rangasthalam huge expectations on RC12
#RamCharan
#boyapatisrinu
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న తొలి చిత్రం కనుక ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. బోయపాటి శ్రీను మాస్ చిత్రాలకు పెట్టింది పేరు. బోయపాటి సినిమాలని మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ చిత్రం కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లబోతోంది. ఇదిలా అండగా సోషల్ మీడియాలో రాంచరణ్, బోయపాటి చిత్రం గురించి కొన్ని పుకార్లు ప్రచారం జరుగుతున్నాయి.
రాంచరణ్, బోయపాటి చిత్ర యూనిట్ త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెల్ళబోతోంది. అక్కడ రెండు వారాల పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. రాంచరణ్ లేకుండానే దర్శకుడు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసాడు. రాంచరణ్ మూడవ షెడ్యూల్ లో షూట్ లో జాయిన్ అయ్యాడు.
రాంచరణ్, బోయపాటి చిత్రం గురించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. కొన్ని సన్నివేశాల పట్ల అసంతృప్తిగా ఉన్న చరణ్ వారిని రీషూట్ చేయాలని బోయపాటిని ఆదేశించినట్లు తెలుస్తోంది. రంగస్థలం చిత్రం విషయంలో కూడా ఇలాంటి పుకార్లే వచ్చాయి. ఏ వార్తల్లో వస్తున్న నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.