SriReddy effect on Tollywood film industry. MAA releases new policies.
శ్రీరెడ్డి వ్యవహారం ముదిరి పాకాన పడ్డ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ నివారణ చర్యలు మొదలు పెట్టింది. కాస్టింగ్ కౌచ్, తెలుగు వారికి అవకాశాలు, జూనియర్ ఆర్టిస్టులకు సెట్స్ లో కనీస సౌకర్యాలు వంటి విషయాలపై శ్రీరెడ్డి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి పోరాటం సరైన దారిలో సాగకపోవడంతో పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడం వంటి జరగకూడని ఘటనలు జరిగాయి. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై ఏకమైన చిత్ర పరిశ్రమ చర్యలు చేపడుతోంది.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఓ ప్యానల్ ని నియమించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్యానల్ లో ఇండస్ట్రీకి చెందిన వారు, బయటివారు 50 శాతం ఉండేట్లు నిర్ణయించారు.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న ప్యానల్ లో షీటీమ్స్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. వీరిలో డైరక్ట్ హాట్ లైన్ ఉంటుంది. దీని ద్వారా కంప్లైంట్ వచ్చిన వెంటనే వేగంగా స్పందిస్తారు.
#SriReddy
#Tollywood
#MAA