Actor Nagababu reacted on recent development on film Industry in media. He speaks about allegations made on the Industry. He promised that he will take care of issues related to Industry. He requested that.. Do not go into Pawan Kalyan personal life.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. రాజకీయ నేతల వలలో పడి కొందరు బలిపశువులుగా మారుతున్నారని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేశంగాను, ఆవేదనగానూ, ఉద్వేగంగానూ మాట్లాడారు. ఇండస్ట్రీ సమస్యలను తీర్చడానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఎనీఆర్ రానక్కర్లేదు. నాలాంటి వాళ్లు చాలూ అని ఆయన అన్నారు. ఉద్వేగంగా నాగబాబు చేసిన ప్రసంగం ఇదే..
సోషల్ మీడియాలో ట్రోల్ విషయం ఎవరి పరిధిలో లేదు. ఎవడో ట్రోల్ చేస్తే పవన్ కల్యాణ్ ప్రాధేయపడ్డాలా. మీ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా వాటిని బయటపెట్టండి. ఎవడైనా తప్పు చేస్తే పోలీసులు, చట్టాలు చర్యలు తీసుకొంటారు. ఏ విషయంపైనా స్పందించవద్దు అని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. చాలా మంది పొలిటికల్‌గా ప్రేరేపితులవుతున్నారు. వాళ్లంతా కొందరి చేతిలో బలిపశువులుగా మారుతున్నారు అని నాగబాబు అన్నారు
మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ సైలెంట్‌గా ఉన్నారని ఏ రాయిపడితే ఆరాయితో కొడితే ఊరుకోం. ఎలా రియాక్ట్ అవుతామో మాకే తెలియదు. మా సహనాన్ని పరీక్షించొద్దు. మమల్నీ చాలా తేలికగా తీసుకోవద్దు. చేతిలో సెల్‌ఫోన్ ఉంది. డబ్బులు ఇచ్చి పిలిపించుకొనే మీడియా ఉందని బాధ్యతారహితంగా ప్రవర్తించకండి. నా మాటల్ని ఎలా అర్థం చేసుకొన్నా ఫర్వాలేదు.