Madhavi Latha commets on Mahesh Babu. Telugu heroines did not get chances for these reasons
#MadhaviLatha
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలని, కాస్టింగ్ కౌచ్ ఉందని మొదట గళం విప్పిన నటి మాధవి లత. శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ పోరాటానికి కూడా మాధవి లతా మద్దత్తు తెలిపింది. కానీ ఆమె విచిత్ర వైఖరితో మాధవీలత పక్కకు తప్పుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలకు అవకాశాల గురించి తన అభిప్రాయం వెల్లడించింది. తెలుగు నటీమణులని చిన్న చూపు చూస్తారని మాధవి లతా గతంలో టాలీవుడ్ గురించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మాధవీలత ఇటీవల బీజేపీలోచేరింది. .అందరిలాగే తనకు కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టం అని మాధవీలత తెలిపింది. హీరో శ్రీకాంత్ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం అని మాధవీలత తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ అనే ప్రత్యేకమైన అభిమానం ఉందని తెలిపింది. అది ఆయన వ్యక్తిత్వం వలెనే అని మాధవీలత తెలిపింది.
తాను బీజేపీలో చేరినంత మాత్రాన పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం పోదు అని మాధవీలత తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో లిప్ లాక్ సీన్ చేయవలసి వస్తే ఎవరితో చేస్తారు అని అడిగితే అసలు ఆ సీన్ లో నటించనని చెప్పా. తప్పని సరి పరిస్థితుల్లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ తోనే అని చెప్పా. పవన్ అంటే అంతటి అభిమానం ఉందని తెలిపింది.