Madhavi Latha Posts A Video About pawan Kalyan & Media

Filmibeat Telugu 2018-04-27

Views 1.4K

Madhavi Latha sensational post about media. I know the truth says Madhavi Latha
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం అంతులేని కథలా సాగుతూనే ఉంది. శ్రీరెడ్డి మొదలు పెట్టిన పోరాటం అనేక మలుపుతిరిగి ఆమె మెడకే చుట్టుకుంది. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడంలో శ్రీరెడ్డి ఓ పావు మాత్రమే అని దీనివెనుక ఉన్న అసలు కథని పవన్ కళ్యాణ్ తన ట్వీట్స్ ద్వారా స్పష్టం చేసారు. కొన్ని మీడియా సంస్థల వేదికగా పవన్ కళ్యాణ్ పై జరిగిన భారీ కుట్రపై పవన్, ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేని డిబేట్లని ఆయా మీడియా సంస్థలు 8 నెలల పాటు ఎలా నడిపాయో సగటు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆయా మీడియా సంస్థలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తో సహా ఆయన అభిమానులు యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజగా హీరోయిన్ మాధవీలత ఈ విషయం గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజాగా మాధవి లతా తన పేస్ బుక్ పేజీ సంచలన పోస్ట్ పెట్టింది. తనకు చాలా నిజాలు తెలుసు అని పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న కుట్రని నర్మగర్భంగా వివరించింది. తనకు నిజాలు ఎలా తెలుసు? ఎవరి ద్వారా తెలుసు అనే విషయాల గురించి మాధవీలత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.
తనకు నిజాయతీ కలిగిన జర్నలిస్టులు కొంతమంది తెలుసు అని మాధవీలత తెలిపింది. నిజాలని బయటపెట్టే క్రమంలో వారిని తొక్కేస్తున్నా కూడా తట్టుకుని పనిచేస్తున్న జర్నలిస్ట్ స్నేహితులు ఉన్నారని మాధవీలత తన పోస్ట్ లో ప్రస్తావించింది. అలాంటి వారిని చూస్తుంటే తనకు గర్వంగా ఉంటుందని మాధవీలత అన్నారు.

#pawan Kalyan
#Madhavi Latha
#Media

Share This Video


Download

  
Report form