విజయ్ దేవరకొండ సావిత్రి పై షాకింగ్ ట్వీట్స్

Filmibeat Telugu 2018-04-25

Views 1.2K

Vijay Deverakonda, who is playing a pivotal role in Mahanati, the upcoming biopic of legendary actress Savitri, faced backlash from fans for calling Savitri a 'cool chick'. The Arjun Reddy star shared a trivia about Savitri which stated that the late actress was a huge fan of race cars and once had a huge collection of vintage cars. He captioned the tweet, "What a cool chick."

అర్జున్‌రెడ్డితో సెన్సేషనల్‌ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండకు బోల్డుగా మాట్లాడే అలవాటు ఉన్న సంగతి తెలిసిందే.వేదిక ఏదైనా గానీ.. సందర్భం ఏదైనా గానీ తన మనసుకు నచ్చిన విధంగా మాట్లాడటం విజయ్ దేవరకొండ నైజం.కానీ అన్నీసార్లు మాట్లాడితే కుదరదని తాజాగా ఓ సంఘటన నిరూపించింది. తాజాగా రిలీజ్ చేసిన సావిత్రి బయోపిక్ పోస్టర్‌ గురించి చేసిన కామెంట్‌పై విజయ్ దేవరకొండను సోషల్ మీడియాలో రఫ్ ఆడించారు.
సావిత్రి బయోపిక్ సంబంధించి సావిత్రి పాత్రలో నటించిన పోస్టర్‌ను విజయ్ దేవర కొండ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోపైన వాట్ ఏ కూల్ చిక్ అంటూ కామెంట్ పెట్టారు. దాంతో ఆయనపై నెటిజన్లు గరం అయ్యారు.
చిక్ ఏందిరా అరేయ్.. సీనియర్లను కొంచమైనా గౌరవించే సంస్కారం నేర్చుకో అంటూ కామెంట్లు వదిలాడు. మరో నెటిజన్.. నీవు ఉపయోగించిన పదం చాలా దారుణంగా ఉంది అని కామెంట్ పెట్టాడు.
ఇప్పటి వరకు నీకు నేను బిగ్ ఫ్యాన్‌ను. కానీ ఈ క్షణం నుంచి నువ్వంటే అసహ్యం. అంతటి మహానటిని పట్టుకొని చిక్ అంటావా?.. సిగ్గుచేటు. సినీ చరిత్రలో ఆమె గొప్ప నటి. రెండు సినిమాలతో పాపులర్ అయిన నీవు ఆమెను అగౌరవంగా సంబంధించడం సరికాదు అని మరో వ్యక్తి పేర్కొన్నాడు.
నెటిజన్లు విరుచుకుపడుతుండటంతో విజయ్ స్పందించాడు. ఎవరైతే క్షమాపణలు కోరుతున్నారో, వారందరూ నేను ఉన్న చెన్నైలోని లీలా ప్యాలెస్‌కు వచ్చేయండి. మహనటి ఆడియో లాంచ్ కార్యక్రమానికి పాసులు ఇస్తాను. మీరందరు వస్తే చాలా ఆమె ఆత్మ సంతోషపడుతుంది. అప్పుడు మీ లాంటి నిజాయితీ, విలువలతో కూడిన మిమ్మల్ని అల్కాహాలిక్ బ్రేకర్స్ అంటుంది అని విజయ్ ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS