heores of Tollywood have been voted as Hyderabad’s Most Desirable Men in 2017. Vijay Devarakonda stands at number 1 position in Most Desirabel men 2017 list. Prabhas and Mahesh Babu follows Vijay in the list.
హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2017 ర్యాంకుల జాబితాలో అర్జున్‌రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ దూసుకెళ్లాడు. విజయ్ తర్వాత స్థానంలో ప్రభాస్ ఉండటం గమనార్హం. అయితే ఇండియన్ ఫిట్‌నెస్ మోడల్, టెలివిజన్ నటుడు బాసీర్ ఆలీ అగ్రస్థానంలో నిలిచి ఈ ఇద్దరి హీరోలకు షాకివ్వడం ఈ జాబితాలో చెప్పుకోదగిన అంశంగా నిలిచింది.
సినీ హీరోలకు సంబంధించిన వరకు విజయ్ దేవరకొండ మొదటిస్థానంలో నిలిచాడు. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాల్లో కేర్‌ఫ్రీ యాటిట్యూడ్‌తో దుమ్మురేపిన విజయ్ మంచి ర్యాంకును సొంతం చేసుకొన్నాడు. గతేడాది విజయ్ ర్యాంకు 20.
బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ప్రభాస్ రెండోస్థానంలో నిలిచాడు. గతేడాది ప్రభాస్ ర్యాంక్ 6. ప్రస్తుతం సాహో షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉన్నారు.
ఇక మహేష్ నాలుగోస్థానంలో నిలిచాడు. 2016లో ఆయన ర్యాంక్ 2 గతేడాది వరుస ఫ్లాపుల కారణంగా ఆయన క్రేజ్ మసకబారిందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు కనిపిస్తున్నది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 5వ స్థానంలో నిలిచాడు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా మారిన చెర్రీ తన లభించిన క్రేజ్‌తో పైకి ఎగబాకాడు. చెర్రీ నటించిన రంగస్థలం చిత్రంలో మార్చి 30న రిలీజ్ కానున్నది. గతేడాది చెర్రీ ర్యాంక్ 14.
గతేడాది ఆయనకు 8 ర్యాంక్ లభించింది. ప్రస్తుతం ఆయన ర్యాంకు 6. బన్నీ నటించిన నా పేరు సూర్య చిత్రం ఏప్రిల్ మొదటివారంలో రిలీజ్ కానున్నది
విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న రానా దగ్గుబాటి 7వ స్థానంలో నిలిచారు. గతేడాదితో పోల్చుకొంటే రానా ర్యాంక్ దిగజారినట్టు టైమ్స్ సంకేతమిచ్చింది. 2016లో రానా ర్యాంకు 4