IPL 2018: Chris Lynn Smashes KXIP

Oneindia Telugu 2018-04-21

Views 24

Kings XI Punjab skipper Ravichandran Ashwin won the toss and invited Kolkata Knight Riders' captain Dinesh Karthik to bat first in the league encounter in Indian Premier League (IPL) 2018 here on Saturday (April 21).

Ashwin immediately opted to chase against hosts at the iconic Eden Gardens in the day-night game. KXIP have made just one change to their side as they have replaced pacer Mohit Sharma with Ankit Rajpoot. Rajpoot last year played for Kolkata. KKR, on the other hand, have not made any changes to their side.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే నరైన్‌(1) వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఊతప్పతో లిన్‌ దాటిగా ఆడాడు. వీరిద్దరు రన్‌రేట్‌ తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి కోల్‌కతా 50 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడు పెంచిన ఉతప్ప34(23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సు).. అశ్విన్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్‌ చేరాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే నితీష్‌ రానా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ బాధ్యాతాయుతంగా ఆడగా.. మరో వైపు క్రిస్‌లిన్‌ రెచ్చిపోయాడు. ఈ దశలో 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో క్రిస్‌లిన్‌ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 147 పరుగుల వద్ద ఆండ్రూ టై బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌గా క్రిస్‌లిన్‌71(41 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్సులు) పెవిలియన్‌ చేరాడు. దీంతో నాలుగో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రస్సెల్‌(10) నిరాశపరిచాడు.


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS