Telugu actors Nithiin and Varun Tej and writer Kona Venkat have taken an indirect dig at actress Sri Reddy for abusing power star Pawan Kalyan and showing her middle finger to him
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అంశంపై కొన్ని రోజులుగా శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ఈ క్రమంలో పలువురు ఇండస్ట్రీ పెద్దలపై ఆమె విమర్శల బాణాలు ఎక్కు పెడుతోంది. ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ తమ పోరాటానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదంటూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి అంటూ తమ పోరాటంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుతో శ్రీరెడ్డి మరింత ఆగ్రహానికి గురయ్యారు.
పవన్ కళ్యాణ్‌ను అన్న అని పిలిచినందుకు నా చెప్పు తీసుకుని కొట్టుకుంటున్నాను అంటూ కెమెరాల ముందే తనను తాను చెప్పుతో కొట్టుకుని అవమానించుకుంది శ్రీరెడ్డి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్‌కు మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిపోయింది.
ప్రతి చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. జస్ట్ వెయిట్... ఇట్స్ కమింగ్ అంటూ నితిన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ శ్రీరెడ్డిని ఉద్దేశించి చేసిన ట్వీట్ అని అంటున్నారు ఫ్యాన్స్.
వరుణ్ తేజ్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. బాబాయ్‌కి మద్దతుగా పదునైన పదజాలంలో ఆయన మద్దతుగా నిలిచారు. ఇందులో ఎక్కడ కూడా శ్రీరెడ్డి ప్రస్తావన లేక పోయినా ఆమెను ఉద్దేశించే వరుణ్ తేజ్ ఈ వ్యాఖ్యలు చేశాడని టాక్.