Sri Reddy Comments On Pawan Kalyan

Filmibeat Telugu 2018-04-21

Views 1.6K

Actor-politician Pawan Kalyan on Friday morning lashed out at Andhra Chief Minister Chandrababu Naidu for “using the media channels under his control” and diverting attention from the Special Category Status (SCS) to the Sri Reddy issue. Sri Reddy counter to Pawan Kalyan in this issue.

తన తల్లిని అత్యంత నీచంగా తిట్టిన, తిట్టించిన వ్యక్తులు, వారి వెనక ఉన్న శక్తులను టార్గెట్ చేస్తూ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ ట్విట్టర్లో ట్వీట్స్ వర్షం కురిపించడంతో పాటు... ఉగ్రరూపం దాల్చి ఫిల్మ్ చాంబర్ వద్ద హడావుడి చేసిన సంగతి తెలిసిందే.పవర్ స్టార్ ఆవేశం చూసిన చాలా మంది ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన అమ్మనుతిట్టిన వారి తాట తీస్తారని, అందరి లెక్కలు తేలుస్తారsని భావించారు.అయితే అలాంటిది ఏమీ నిర్వహించకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ హడావుడి తగ్గిన వెంటనే....శ్రీరెడ్డి యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పలు కామెంట్స్ చేశారు.
రామ్ గోపాల్ వర్మకు, మహా టీవీకి, టీవీ 9, ఏబీఎన్‌కు నా క్షమాపణలు. ఒక రోజు హడావుడికి భయపడి తోక ముడిచే పోరాటం కాదు మాది. 10 సంవత్సరాల క్రితం ఒంటరిగా వచ్చా. చాలా అనుభవించా, ఎవరినీ వదలను.... అంటూ శ్రీరెడ్డి పేర్కొన్నారు.
ఏ పొలిటికల్ పార్టీకి, మాకు ఏ విధమైన సంబంధం లేదు. వైఎస్ఆర్‌సిపిని అనుమానించినందుకు చాలా బాధపడుతున్నాను. పొలిటికల్ డ్రామా నాకు చేతకాదు. యాక్టింగ్ పోరాటాలు చేయడం అసలు రాదు...అని శ్రీరెడ్డి తెలిపారు.
మహా టీవీ మీద కొంచెం అలిగాను కానీ, మహాటీవీకి మచ్చ పెడితే ఊరుకోను. పోరాటాలు ఎవడి సొత్తు కాదు. ఒక జర్నలిస్టుగా చెబుతున్నాను. మీ ఆధిపత్యం సినిమాలో...మా చాంబర్లో చూపించండి, జర్నలిస్టుల మీద చూపిస్తే బాగోదు. టీవీ 9 మీద బురద జల్లితే... మీకే మరకలు పడతాయి.... అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.
జర్నలిస్ట్ జోలికొస్తే బాగోదు.... అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది.
ప్యాకేజీల కోసం పోరాటాలు చేసే వాళ్లు ఎవరో అందరికీ తెలుసు. ఇదే నా సవాల్.. కమిటీ వేయండి.... నిజాలు బయటకు రావాలి. నేను తీసుకున్నట్లు తెలిస్తే తల్వార్ తో నరుకు....అంటూ శ్రీరెడ్డి సవాల్ విసిరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS