Rohith sharma gives an explination for loosing match.He analysis the pattern of match & players performance in the last matches
గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీరుపై కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ 'వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ మమ్మల్ని గెలుపు ఊరించినట్లే ఊరించి దూరమైంది. ఇది చాలా నిరాశపరిచింది. మేము మంచి స్కోరు సాధించలేకపోయాం' అని పేర్కొన్నాడు.
అందుకే ఓడిపోయాం. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరొకలా ఉండేది. మా బ్యాట్స్‌మెన్ ఇంకా బాగా ఆడాల్సింది. బ్యాట్స్‌మెన్ వైఫల‍్యమే మా కొంప ముంచింది. ఇక బౌలర్లు ఆద్యంత ఆకట్టుకున్నారు. సాధారణ స్కోరును కూడా రక్షించడానికి తీవ్రంగా శ్రమించారు' అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఒకనాక దశలో గేమ్‌ను మా చేతుల్లోకి తీసుకొచ్చారు. అద్భుతమైన జట్టుని కలిగి ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాలేదు. చివరి వరకూ పోరాడినా ఓటమితోనే సరిపెట్టుకోవాల్సి వచ‍్చింది. సన్ రైజర్స్ చేతిలో ఓటమి బాధించినా.. యువ క్రికెటర్లు ఆకట్టుకున్న తీరు బాగుంది' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ శనివారం నాడు సొంత మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో తలపడనుంది. మరోవైపు అదే రోజున సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాతో తలపడనుంది. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముం
బై ఇండియన్స్ ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది.
ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరి బంతికి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోగా, ముంబై ఇండియన్స్ రెండో ఓటమిని ఎదుర్కొంది. ఐపీఎల్ ఆరంభపు మ్యాచ్‌లో వాంఖడెలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైన సంగతి తెలిసిందే.