Chennai Super Kings fans will be as thrilled not just that their favourite franchise is back in action after two years in suspension, but that the core group of players that arguably defined it as a side — MS Dhoni, Suresh Raina, Ravindra Jadeja — have been retained for the upcoming season.
వేసవి ఆటవిడుపుగా అభిమానులకు దగ్గరై టీవీల ముందు నుంచి కదలకుండా చేసే ఐపీఎల్ వ్యాపారం కొన్ని కోట్ల రూపాయలలో జరుగుతుంది. ఈ వేలంలో ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వాళ్లు, ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్లు, పలు అవార్డులు, రివార్డులు గెలుచుకున్న వాళ్లు.. ఇన్ని విధాలుగా పెద్ద మొత్తంలో లాభాలు చేకూరతాయి. వీటితో సంబంధం లేకుండా కేవలం కొనుగోలుతోనే రూ.100కోట్లు వరకూ సంపాదించిన టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు.
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఈ రూ.100కోట్ల క్లబ్‌లో చేరారు. ఈ పదకొండు ఐపీఎల్ సీజన్లలో ఆ జట్టు ఫ్రాంఛైజీ నుంచి వీరు ఒక్క వేతనం రూపంలోనే రూ.100కోట్లు పైగా సంపాదించేశారు. ధోనీ అత్యధికంగా రూ.107.8 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా రూ.101.6 కోట్లతో రోహిత్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.
2016, 2017 సీజన్లలో ధోనీ.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తిరిగి ఈ ఏడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను నడిపించాడు. ఈ పునరాగమనంలోనే జట్టును ట్రోఫీ విజేతగా నిలబెట్టాడు. ముప్పై కి పైబడిని వారందరినీ జట్టులోకి తీసుకుంటున్నారనే విమర్శలను ఎదుర్కొంటూ, గాయాలపాలై జట్టులోని ఆటగాళ్లు దూరమవుతున్న ఒడిదుడుకులను తట్టుకుంటూ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించారు.