IPL 2018 : Goutham Gambhir Plays His Role During Match With Kings Punjab

Oneindia Telugu 2018-04-09

Views 31

IPL 2018 match was held between punjab & delhi dare devils.Goutham has covered a wonderful innings in the match & had his mark during the match

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కెప్టెన్‌ గౌతం గంభీర్‌ మెరిశాడు.36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు.ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ గంభీర్‌ మాత్రం నిలకడగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు.ఇది గంభీర్‌కు 36వ ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును వీడి హోమ్‌ టీమ్‌ ఢిల్లీకి వచ్చిన గంభీర్‌ ఆడుతున్న మొదటి మ్యాచ్‌లోనే బాధ్యతాయుత ఇన‍్నింగ్స్‌ ఆడాడు.
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కోలిన్‌ మున్రో, గంభీర్‌లు ఆరంభించారు. జట్టు 12 పరుగుల వద్ద ఉండగా మున్రో(4) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై శ్రేయస్‌ అయ్యర్‌(11), విజయ్‌ శంకర్‌(13)లు కూడా నిరాశపరిచారు. కాగా, గంభీర్‌ మాత్రం సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.కాగా,జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉండగా గంభీర్‌(55) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.అనవసరపరుగు కోసం యత్నించి రనౌట్‌గా నిష్క్రమించాడు.అంతకుముందు రిషబ్‌ పంత్‌(28) దాటిగా ఆడే క్రమంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS