Rangasthalam movie 5th day collection report. It is nearer to Khaidi no150 first week record.
రాంచరణ్ రంగస్థలం చిత్ర హవా ఐదవ రోజు కూడా కొనసాగింది. రంగస్థలం చిత్రం రాంచరణ్, సుకుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. రంగస్థలం చిత్రం ఫుల్ రన్ లో 100 కోట్లు సాధించే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
రికార్డుల రీసౌండ్ వినిపించేలా రంగస్థలం హవా కొనసాగుతోంది. తొలిరోజు నుంచే రంగస్థలం చిత్రం రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో రంగస్థలం మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది.
రాంచరణ్ లాంటి స్టార్ హీరోని వినికిడి లోపంతో చూపించడమే సాహసం. అలాంటిది ఈ చిత్రాన్ని 1980 బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ డ్రామాగా సుకుమార్ తెరకెక్కించారు. అందుకే అయన దర్శకత్వ ప్రతిభకు సినీ ప్రముఖులంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
రంగస్థలం చిత్ర హవా ఐదవ రోజు కూడా కొనసాగింది. 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రంగస్థలం చిత్రం సుమారు 70 కోట్లకుపైగా షేర్ వసూలు చేయడం విశేషం. వందకోట్లకు చేరువయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
5 వరోజు మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల మార్క్ దాటేసింది. రెండుతెలుగు రాష్ట్రలో ఐదవరోజు మాత్రమే 5.15 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.
మెగాస్టార్ ఖైదీ నెం 150 చిత్రం తొలివారంలో దాదాపు 76 కోట్లు వసూలు చేసింది. బుధవారం లేదా గురువారం రోజుకు రంగస్థలం చిత్రం ఖైదీ తొలి వారం రికార్డుని అధిమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.