Balakrishna To Romance Deepika Padukone!

Filmibeat Telugu 2018-04-03

Views 1

Bollywood beauty Deepika Padukone to romance with Balakrishna. NTR biopic team approached Deepika Padukone

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించబోతున్నాడు. తేజా ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆసక్తికరమైన కథగా మలచి ఎన్టీఆర్ చిత్రం తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం వైభాగంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఈ చిత్రం భారీ స్థాయి పెరుగుతుండడం విశేషం.
ఎన్టీఆర్ జీవిత చరిత్రని అభిమానులకు అందమైన దృశ్య కావ్యంగా చూపించాలని బాలయ్య భావిస్తున్నాడు. దీనికోసం ఎంత బడ్జెట్ అయినా వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది. బాలకృష్ణ ఈ చిత్రంలో 60 కి పైగా వేషధారణలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ జీవితంలో వివిధ మజిలీలకు తగ్గట్లుగా బాలయ్య ఆ వేషధారణలో మెప్పించబోతున్నాడు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. దీపికా పదుకొనెని ఈ చిత్రంలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, దివంగత నటి శ్రీదేవి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. శ్రీదేవి పాత్రకూడా ఎన్టీఆర్ బయోపిక్ లో ఉంటుంది. శ్రీదేవి పాత్ర కోసం చిత్రయూనిట్ దీపికా పదుకొనెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీపికా ఒకే అంటే బాలయ్యతో ఆమె రొమాన్స్ అభిమానులు చూడవచ్చు.

Share This Video


Download

  
Report form