Amitabh Bachchan To Schedule For Saira Movie

Filmibeat Telugu 2018-03-28

Views 492

Amitabh Bachchan has headed out to Hyderabad to shoot for Chiranjeevi’s magnum opus titled Sye Raa Narasimha Reddy. As Big B reveals in his blog entry for March 27, he has been roped in for a guess

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలకమైన పాత్రలో నటింబోతున్న సంగతి తెలిసిందే. 'సైరా' షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తున్న విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఆయన తన బ్లాగులో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నా ప్రియ మిత్రుడు చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి'లో ఓ అతిథి పాత్రలో నటించమని నన్ను కోరారు. అందుకే హైదరాబాద్ వచ్చాను. కొన్ని గంటల్లో చిత్రీకరణలో పాల్గొనబోతున్నాను.... అని అమితాబ్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో నా పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ టెస్ట్‌లు జరిగాయి.. సైరాలో నేను కాస్త అటూ ఇటుగా ఇలా కనిపించబోతున్నాను అంటూ అమితాబ్ తన బ్లాగులో ఓ ఫోటో పోస్టు చేశారు. ఈ చిత్రంలో అమితాబ్ చిరంజీవి గురువు పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది
ముంబై నుండి అమితాబ్ హైదరాబాద్ రావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అమితాబ్ చేస్తున్నది చిన్న పాత్రే కావడంలో ఒకే షెడ్యూల్‌లో ఆయన షూటింగ్ పార్టు పూర్తి చేయబోతున్నారని, తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తయిన తర్వాతే అమితాబ్ తిరిగి ముంబై వెళతారని సమాచారం
‘సైరా' చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తవ్వగా.... ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. మెగా తనయుడు రామ్ చరణ్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు

Share This Video


Download

  
Report form