Pawan kalyan Surprises Charan On His Birthday

Filmibeat Telugu 2018-03-27

Views 2.2K

Mega Power Star Ramcharan birth day celebrations meet at chiranjeevi bank. producer Sri Allu Aravind hero Varun tej chief guests. over 600 mega fans are donated organs. Apart from this, Power Star Pawan Kalyan attended for Ram charan Birthday celebrations at Chirajeevi home.

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు వేడుక‌లు నేడు (మంగ‌ళ‌వారం) హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు ర‌మ‌ణం స్వామినాయుడు ఆధ్వ‌ర్యంలో ఘనంగా జ‌రిగాయి.ఈ సంద‌ర్భంగా వంద‌లాది మంది అభిమానులు ర‌క్తదానం చేసారు.అనంత‌రం అభిమానులంతా క‌లిసి బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేసి చర‌ణ్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.
నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ, `మా కుటుంబంలో ఉన్న ప్ర‌తీ యాక్ట‌ర్ పుట్టిన రోజుకి, అలాగే వాళ్ల కుటుంబంలో ఏ శుభ‌సంద‌ర్భం వ‌చ్చినా ఆభిమానులంతా ఆ ఎమోష‌న్ ను ర‌క్త‌దానం రూపంలో చూపిస్తున్నారు. ఈ సెంటిమెంట్ ను మీలో ఉంచుకుని మాతో అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. అందుకు వాళ్ల‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డే ఉంటాం.
హీరో కాకముందు రామ్ చ‌ర‌ణ్ ఓ సారి బాంబేలో యాక్టింగ్ కోర్సు ట్రైనింగ్ కి వెళ్లాడు. ఆర్టిస్ట్ కొడుకు ఆర్టిస్ట్ అవ్వాల‌నేమి లేదు. అలా కొంత మందే అవుతారు. కానీ కోర్స్ పూర్తిచేసి వ‌చ్చిన త‌ర్వాత మాకొక వీడియో చూపించాడు. అది చూసి అత‌ను స్టార్ అవుతాడ‌ని ఆరోజే మేమంతా నిర్ణ‌యానికి వ‌చ్చేసాం.
మగధీర తర్వాత రామ్ చ‌ర‌ణ్‌కు చాలా హిట్లు వ‌చ్చాయి. మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత చర‌ణ్ తో `ధృవ‌` సినిమా చేశాం. అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు `రంగ‌స్థ‌లం` తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఆ సినిమాల‌న్నింటి కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు అని అన్నారు. నిర్మాత న‌వీన్ చాలా కాలం నుంచి స్నేహితులు. ఆయ‌న చ‌ర‌ణ్ తో మంచి సినిమా చేశారు. పెద్ద విజ‌యం అందుకోబోతున్నారు. చివ‌రిగా మ‌రోసారి చ‌ర‌ణ్ కు హ్యాపీ బ‌ర్త్ డే` అని అల్లు అరవింద్ అన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS