Sai Dharam Tej-Maruthi-Rashi Kanna's Prathi Roju Pandage launched today which is produced by Bunny Vas and presented by Allu Aravind.
Prathi Roju Pandage,
#SaiDharamTej
#RashiKhanna
#Maruthi
#AlluAravind
#bunnyvas
#tollywood
#movielaunch
#uvcreations
మెగాహీరో సాయి ధరం తేజ్ తాజాగా ఓ కొత్త సినిమాను మొదలుపెట్టారు. దర్శకుడు మారుతి రూపొందించనున్న ఈ సినిమాకి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కి జంటగా రాశిఖన్నా కనిపించనుంది.అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాకార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగింది. దర్శకుడు మారుతితో తన కొత్త సినిమా మొదలైందని సాయి ధరం తేజ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ తేజు ఇటీవల 'చిత్రలహరి'తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. మారుతీతో తో చేయబోయే తన కొత్త సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. మారుతి కెరీర్ కి కూడా ఈ సినిమా ఎంతో కీలకం. తనదైన స్టైల్ లో కామెడీ, కమర్షియల్ యాంగిల్ లో సినిమాను రూపొందిస్తున్నాడు.