Allu Aravind Speech At Tej I Love You Movie Press Meet

Filmibeat Telugu 2018-07-04

Views 2.3K

Allu Aravind Superb speech at Tej I Love You Movie Grand Release Press Meet which is held at Hyderabad. Sai Dharam Tej, Karunakaran, KS Rama Rao, Allu Aravind, Aswani Dutt‎, V Chamundeswaranath, Simha at the event.

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.
చిరంజీవితో నిర్మాత కెఎస్ రామారావు జర్నీ, నా జర్నీ ఒకేసారి మొదలైంది. నేను ఆయన కంటే ముందు ఒకటి రెండు సినిమాలు చిరంజీవితో చేశాను. కానీ ఆయన నా తర్వాత వచ్చి.... చిరంజీవి సినిమాల్లో నేను చేయలేని ఎన్నో ప్రత్యేకతలు చూపించారు. ఇళయరాజాను తీసురావడం, కాశ్మీర్లో షూటింగ్ లాంటివి చేసేవారు. అపుడు ఆయన మీద నిజమైన అప్రిషియేషన్ ఉండేది. కొంత కాలం ఆయనతో పోటీ పడితీశానేమో అనిపిస్తుంటుంది.
ఓసారి కెఎస్ రామారావు సినిమాలు వరుసగా దెబ్బతిని లాస్ అయినపుడు... నేను ఓ విషయం అడిగాను. నెక్ట్స్ ప్రాజెక్ట్ కరెక్టుగానే ఉందా? అంటే ఆయన ఒక మాట అన్నారు. ‘లాభం నష్టం ఇవన్నీ పక్క...నా ఆఖరి రూపాయి ఉండే వరకు ఈ సినిమాల్లోనే పెడతా, సినిమాల్లోనే ఉంటా, సినిమాల్లోనే చచ్చిపోతా' అన్నారు. ఆ రోజు ఆయన మాట విన్నపుడు నా గుండె జల్లుమంది. ఆయనలో సినిమాపై ఎంత పాషన్ ఉందో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ... అని అరవింద్ వ్యాఖ్యానించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS