Ms Dhoni and Suresh Raina Practice For IPL

Oneindia Telugu 2018-03-24

Views 151

Chennai Super Kings captain MS Dhoni joined the team on Thursday to practice nets on the same evening as he prepares to lead the said franchise back into competition after a gap of two years.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మొదలైంది. ఐపీఎల్ 2018 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఆటగాళ్లు ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు. రెండేళ్ల విరామం తర్వాత ఈ సీజన్‌లో అడుగుపెట్టిన చెన్నై జట్టుని నిర్వాహకులు బాగా ప్రమోట్ చేస్తున్నారు.
ఫొటో షూట్‌లు, యాడ్‌లతో బిజీగా గడుపుతోన్న ఆటగాళ్లు మరోపక్క తమ ప్రాక్టీస్‌నూ కొనసాగిస్తున్నారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. తాజాగా చెన్నై జట్టులోని ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌లో పాల్గొన్న వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వాహకులు తమ అధికారిక ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఈ వీడియోలో ధోని, రైనా, జడేజాతో మిగతా ఆటగాళ్లు వార్మప్‌ చేసిన అనంతరం బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్‌ 7న ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS