Allu Ayaan As Chittibabu, Pic Goes viral

Filmibeat Telugu 2018-03-22

Views 1.8K

Megapowerstar Ram Charan’s ‘Rangasthalam’ is carrying good positive buzz all around.Now Allu Arjun’s son Allu Ayaan is spotted in Chitti Babu outfit the picture is going viral in the social media.


రంగస్థలం చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు అన్ని ఆకట్టుకునేలా ఉండడంతో సినీ అభిమానులంతా రంగస్థలం చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాంచరణ్ రంగస్థలం చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో చరణ్ ఎలా నటించాడనే ఆసక్తి అందరిలో ఉత్కంఠ రేపుతోంది.
రాంచరణ్ మునుపెన్నడూ కనిపించని గెటప్ లో దర్శనం ఇవ్వడంతో చరణ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ చరణ్ మామ ఫోజులో నిలబడి అబ్బురపరిచారు.ఎంతో క్యూట్ గా ఉన్న అయాన్ చిట్టిబాబు ఫోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ తనయుడు అయాన్ చిన్న వయసులోనే సినిమాలకు పెద్ద అభిమానిగా మారుతున్నాడేమో. రంగస్థలం చిత్ర ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. రాంచరణ్ చిట్టిబాబు గెటప్ లో ఉన్న అయాన్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బన్నీ ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
అయాన్.. చరణ్ మామకు పెద్ద అభిమాని అని బన్నీ ఈ ఫొటోకు కామెంట్ పెట్టాడు. అయాన్ ఫోజు మెగా అభిమానులని తెగ ఆకట్టుకుంటోంది.

Share This Video


Download

  
Report form