Allu Arjun Son Allu Ayaan Birthday Celebrations

Filmibeat Telugu 2018-04-03

Views 3.3K

Allu Arjun and Sneha Reddy Celebrates son Ayaan Birthday. The couple were blessed with a baby boy Allu Ayaan in 2014. As Ayaan turns 4 today, Allu Arjun celebrated his birthday in his house.

'రంగస్థలం' సినిమా విడుదల ముందు అల్లు అర్జున్ కుమారుడు అయాన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. రంగ రంగ అనే పాట పాడుతూ మామయ్య రామ్ చరణ్ మాదిరి చిట్టిబాబు గెటప్‌లో అభిమానులను అలరించాడు. తాజాగా మరోసారి అల్లు అయాన్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకు కారణం నేడు(ఏప్రిల్ 3) అయాన్ పుట్టినరోజు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు తమ ముద్దుల కుమారుడిని పుట్టినరోజు వేడుక ఈ సారి ఇంట్లోనే నిర్వహించారు. గత రెండు పర్యారాలు దుబాయ్, గోవాల్లో అయాన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అయితే ప్రస్తుతం బన్నీ తన తాజా చిత్రం ‘నా పేరు సూర్య'కు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో హైదరాబాద్‌లోనే పుట్టినరోజు వేడుక జరిపారు.
2014 ఏప్రిల్ 3న అల్లు అయాన్ జన్మించిన సంగతి తెలిసిందే. నేటితో అయాన్ 4వ వసంతంలోకి అడుగు పెట్టాడు. సినిమా కుటుంబంలో పుట్టడంతో పుట్టుకతోనే అల్లు అయాన్ స్టార్ కిడ్ అయిపోయాడు. సోషల్ మీడియాలో అయాన్‌ను విష్ చేస్తూ మెగా అభిమానుల నుండి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
'రంగస్థలం' పాటలు వింటూ బన్నీ కొడుకు ఇంట్లో గోల గోల చేయడంతో రంగస్థలంలో తన గెటప్ లాంటి దుస్తులను రెండు జతలు కుట్టించి అల్లుడికి గిఫ్టుగా పంపారు చరణ్. చెర్రీ మాదిరిగా లుంగీ కట్టుకుని అయాన్ ఫోజులు ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తన చుట్టూ సినిమా వాతావరణం ఉండటం.....ఇంట్లో అందరూ సినిమా రంగానికి చెందిన వారే కావడంతో అల్లు అయాన్ ఈ వయసు నుండే సినిమాలపై ఆసక్తి పెంచుకుంటున్నాడు. అయాన్ వాలకం చూస్తుంటే భవిష్యత్తులో పెద్ద స్టార్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form