Allu Arjun Is Aamir Khan Of Tollywood

Filmibeat Telugu 2018-02-12

Views 1.9K

Tollywood Dialogue Writer Diamond Ratna Babu intresting comments about Mohan Babu, Pawan Kalyan and Allu Arjun.

డైమండ్ రత్నబాబు... తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని స్టార్ రైటర్. ఇప్పటి వరకు కామెడీ, ఫన్ ఎంటర్టెన్మెంట్‌ను తన కలం ద్వారా పుట్టించిన ఆయన 'గాయిత్రి' సినిమా ద్వారా తన రచనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. తాజాగా ఆయన ఓ వెబ్ చానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా.... మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, బన్నీ గురించి చెప్పిన విషయాలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయి.
నాకు మోహన్ బాబు గారి పరిచయం ఇండస్ట్రీలో నా దశ తిరిగేలా చేసింది. ఆయనకు గాడ్ ఫాదర్ లాంటివారు అని డైమండ్ రత్నబాబు తెలిపారు. మోహన్ బాబు గారి బేనర్లో ఏ సినిమా వచ్చినా నాకు అవకాశం తప్పకుంటా ఉంటుందని చెప్పారని ఈ సందర్భంగా రత్నబాబు వెల్లడించారు.
‘పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమైన వ్యక్తి. ఆయన ఒక ఉన్నతమైన శిఖరం లాంటోడు. ఇపుడు ఆయన వయసు 43 ఏళ్లు. కానీ రజనీకాంత్ 68 ఏళ్లకు రాజకీయాల్లోకి వచ్చారు, కమల్ హాసన్ గారు 64 ఏళ్లకు వచ్చారు. అన్న ఎన్టీఆర్ 58 ఏళ్లకు వచ్చారు. చిరంజీవి గారు 52 ఏళ్లకు వచ్చారు. ఒక వ్యక్తి 43 ఏళ్ల వయసులో తన కెరీర్ వదిలేసి బయటకు వచ్చాడంటే అది పవన్ కళ్యాణ్...ఆయనకు హాట్సాఫ్' అని రత్నబాబు వెల్లడించారు.
చాలా మంది పవన్ కళ్యాణ్ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇతను వారికి అమ్ముడు పోయాడు, ఈ రాష్ట్రంలో ఇక్కడ అమ్ముడు పోయాడు అని అంటుంటారు. వారికి అసలు అర్థం కాని విషయం ఏమిటంటే అతడు ఒక 10 సినిమాలు చేస్తారు. సినిమాకో 20 కోట్లో, 30 కోట్ల వస్తాయి. మొన్న మైత్రి మూవీస్ 40 కోట్లు ఆఫర్ చేసింది. ఇది మొత్తం లెక్కలేస్తే ఓ 10 సినిమాలు చేస్తే 300 కోట్లు వస్తాయి. ఇలా అమ్ముడు పోయే బదులు యాడ్స్ చేస్తే ఎన్నో వేల కోట్లు వస్తాయి. అయినా ఆయనకు అమ్ముడు పోవాల్సిన అవసరం ఏముంది.... అని రత్నబాబు వెల్లడిచారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS