Vijay Devarakonda new movie release date fix. Vijay Devarakonda will going to fight with Allu Arjun and Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ తాజా చిత్రాల విడుదల విషయంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భరత్ అనే నేను, నా పేరు సూర్య చిత్రాలు రెండు వారాల గ్యాప్ లో విడుదలయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. మొదటగా ఈ రెండు చిత్రాలు ఏప్రిల్ 27 న విడుదల అయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నాయి. కానీ నిర్మాతల చర్చలతో భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 కి ప్రీపోన్ కాగా, నా పేరు సూర్య చిత్రం మే 4 కు పోస్టుపోన్ అయింది. వివాదం సద్దుమణిగింది అని అనుకుంటే క్రేజీ యువహీరో విజయ్ దేవరకొండ ఈ బిగ్ స్టార్స్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మహేష్, బన్నీల చిత్రాలకు కూసంత దూరంలో తన సినిమాని విడుదల చేసేందుకు సిద్ధం అవుతన్నాడు.
భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్ లోనే భారీ అంచనాలతో విడుదలకు సిద్ధం అవుతోంది.మహేష్ బాబు ఈ చిత్రంలో రాజకీయనాయకుడిగా, ముఖ్యమంత్రిగా కనిపించబోతుండడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొని ఉంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బన్నీ చిత్రాలన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మిలటరీ మాన్ గా బన్నీ నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో విడుదలైన టీజర్ అదిరిపోయిన సంగతి తెలిసిందే.