Disha patani To Play A Lead Role In Crazy Movie

Filmibeat Telugu 2018-03-22

Views 645

Disha Patani on Sanghamitra. I am no one to replace Shruti Haasan says Disha Patani

తమిళంలో భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రాలలో సంఘమిత్ర చిత్ర కూడా ఒకటి ఈ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి.
సంఘమిత్ర చిత్రం యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతోంది. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపిందించడానికి సిద్ధం అవుతున్నారు.
శృతి హాసన్ ఈ చిత్రంలో నటిచాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ తో తలెత్తిన విభేదాల వలన శృతి హాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఇంతటి క్రేజీ మూవీ నుంచి శృతి తప్పుకోవడంతో సినీవర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరిగింది.
దీనితో చిత్ర యూనిట్ పలువురు హీరోయిన్లని పరిశీలించింది. చివరకు దిశా పటానిని ఎంపిక చేయడం విశేషం.
ఊహించని విధంగా దిశా పటానికి సంఘమిత్ర చిత్రంలో నటించే అవకాశం రావడంతో మీడియా ఫోకస్ ఆమెపై పడింది. శృతి హాసన్ ని రీప్లేస్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అని ఆగడగా అదిరిపోయేలా సమాధానం ఇచ్చింది. శృతి హాసన్ ని రీప్లేస్ చేయటానికి నేను ఎవరిని అంటూ దిశా సమాధానం ఇచ్చింది.
శృతి హాసన్ నాకన్నా సీనియర్ నటి. ఆమెతో పోల్చుకుంటే నేను నటించిన చిత్రాలు చాలా తక్కువ. అలాంటప్పుడు నేను శృతి హాసన్ ని రీప్లేస్ చేయడం ఏంటి అని ప్రశ్నించింది. చిత్ర యూనిట్ కి, శృతి హాసన్ కు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కనీసం నేను అడగలేదు. మీకు తెలుసుకోవాలని ఉంటె వెళ్లి డైరెక్టర్ ని అడుక్కోండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Share This Video


Download

  
Report form