Posani Krishna Murali is known for his sharp and emotional comments. On Wednesday in an interview he lashed out at Nara Lokesh and Babu Rajendra prasad
ఏపీ అధికార పక్షం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. హోదా కోసం పోరాడుతున్నామన్న విశ్వాసం కలిగించలేక.. ప్రత్యర్థుల ఆరోపణలను తట్టుకోలేక విలవిల్లాడిపోతోంది. ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో.. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు కూడా మొదటికే మోసం తెచ్చేలా మారాయి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయి. దీంతో చలన చిత్ర ప్రముఖులు సైతం టీడీపీని గట్టిగానే .
నటుడు, రచయిత అయిన పోసాని కృష్ణ మురళి.. టీడీపీ ప్రభుత్వాన్ని నిలువునా కడిగిపారేస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నచోట ప్రజా ఉద్యమాలు ఎలా పుట్టుకొస్తాయని ప్రశ్నిస్తున్నారు.
సినీ పరిశ్రమపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలకు కూడా ఘాటైన కౌంటర్ ఇచ్చారు పోసాని. 'మీరు లేచినప్పుడే మేమూ లేవాలా?.. మీకంటే ముందు మేము లేచినప్పుడేమో లాఠీలతో కొట్టిస్తారా?..' అని ప్రశ్నించారు. చేవ చచ్చిపోయిందా? అని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నిస్తున్నారని.. దానికి అనేక రకాల అర్థాలున్నాయని పేర్కొన్నారు. ఇక టీడీపీ, లోకేష్ అవినీతి ఆరోపణలపై నిజనిజాలేంటో తనకు తెలియదని కాబట్టి వాటిపై మాత్రం స్పందించనని అన్నారు పోసాని.
ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సంపాదిస్తున్న వందల కోట్ల మత్తులో జోగుతున్నారా? అన్న ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌కు మరో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు పోసాని. మత్తులో జోగుతున్నది సినిమావాళ్లు కాదని, అసలు మత్తులో జోగుతోంది ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అని అన్నారు. గతంలో లీకైన లోకేష్ విదేశీ ఫోటోలను చూపుతూ.. 'ఆయన కేవలం అమ్మాయిలతోనే మందు తాగుతారు, విదేశాల్లో టేపుతో అమ్మాయిల నడుమును కొలుస్తారు' అని పోసాని ఎద్దేవా చేశారు.