Tollywood writer and actor Posani Krishna murali made allegations on Andhra pradesh IT minister Nara Lokesh on Tuesday. Posani Krishnamurali responded on minister Nara Lokesh allegations. He said that I will not take Nandi award.
టెంపర్ సినిమాకు తనకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తిరస్కరిస్తున్నట్లు టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ప్రకటించారు. నంది అవార్డులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. నంది అవార్డులపై ప్రభుత్వంపై సినీ పరిశ్రమకు చెందిన కొందరు విమర్శలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడ ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది. అయితే మంత్రి లోకేష్ చేసిన విమర్శలపై తాజాగా పోసాని కృష్ణ మురళి సీరియస్ అయ్యారు.
ఏపీ ప్రభుత్వం మూడేళ్ళకు నంది అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల విషయమై విమర్శలు ప్రారంభమయ్యాయి. రుద్రమదేవి సినిమాకు అవార్డు రాకపోవడం పట్ల ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుణశేఖర్‌కు తోడుగా మరికొందరు కూడ ఇదే బాటలో పయనించారు.ఈ పరిణామాలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ వేర్వేరుగా స్పందించారు. అయితే జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ప్రకారంగానే అవార్డులను ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.