AP CM Chandrababu Naidu given guidance to TDP MPs in a tele conference here in Amaravati on Friday. While speaking to them Babu slammed YS Jagan. "Jagan is a A-1 in 11 Cases, Now Should I follow him, what he is telling, He will move the no confidence motion against NDA government and he is demanding that TDP should support him. How silly is this?" Chandrababu said
అక్రమాస్తులు, క్విడ్ ప్రోకోలకు సంబంధించి 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని తాను అనుసరించడం ఏంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం ఎంపీలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. తాము అవిశ్వాసం పెడతామని, టీడీపీ మద్దతివ్వాలని జగన్ డిమాండ్ చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.
జగన్ దగ్గర ఇప్పుడు జాతీయ రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో పలు పార్టీల అభిప్రాయాలను ఇప్పటికే అడిగి తెలుసుకున్నానని, ఎన్నో పార్టీలు మద్దతు పలికాయని ఆయన వెల్లడించారు.
ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని, ప్రజా ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో టీడీపీకి సహకారాన్ని అందించేందుకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఎంపీలకు తెలిపారు.