Keshava Rao back in action for CM K Chandrasekhar Rao's national foray, KK behind KCR's third front proposal.
బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా అనూహ్యంగా థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీసుకుని వచ్చారు. అవసరమైతే తానే మూడో కూటమికి నాయకత్వం వహిస్తానని చెప్పారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనబరిచి ముందుకు దూకడం వెనక ఉన్నది రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు అనే మాట వినిపిస్తోంది. మూడో కూటమి గురించి కేసిఆర్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కేకే ఉన్నారు.
టిఆర్ఎస్‌లో చేరడానికి ముందు కేశవరావు కాంగ్రెసులో ఉన్నారు. ఆయన జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరించారు. ఆ సంబంధాలను థర్డ్ ఫ్రంట్‌కు కేసిఆర్ నాయకత్వంలో మద్దతును కూడగట్టేందుకు అప్పటి సంబంధాలను కేశవరావు వాడుతున్నట్లు తెలుస్తోంది.
మమతా బెనర్జీతోనూ హేమంత్ సొరేన్‌తోనూ కేశవ రావు మాట్లాడారని, ఆ తర్వాతే వారు మద్దతు తెలియజేశారని అంటున్నారు. కేసిఆర్‌తో కలిసి పనిచేస్తానని, భావస్వారూప్యం కలిగిన పార్టీలను కూడగట్టడానికి తాను కూడా ప్రయత్నిస్తానని మమతా బెనర్జీ చెప్పినట్లు తెలుస్తోంది.