Slap to Ap Ministers By Amith Sha..కేంద్ర సమావేశం సంతృప్తికరంగా లేదు

Oneindia Telugu 2018-03-06

Views 5

The lock over TDP's demand for special category status to Andhra Pradesh continued on Monday, as the meeting between party leaders and Union Finance Minister Arun Jaitley failed to make a breakthrough.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో టిడిపి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు పోరు కొనసాగిస్తున్నాయి. పార్లమెంటులో రెండో రోజు కూడా సభను అడ్డుకోవాలని నిర్ణయించాయి.

ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో నారా చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జరిగిన సారాంశాన్ని ఎంపీ తోట నర్సింహం అధినేతకు వివరించారు. అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా కేవలం రెండు అంశాల పైనే చర్చించారని, మిగతా అంశాలను వదిలేశారని టీడీపీ ఎంపీలు అధినేత దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సమావేశం సంతృప్తికరంగా లేదని చెప్పారు. దీంతో ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశనం చేశారు.

కేంద్రం నుంచి అన్ని అంశాలపై మనకు స్పష్టత సాధించే వరకు మన వైఖరిలో మార్పు లేదన్నారు. అవసరమైతే సభలో తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ ఎంపీలతో పాటు కలిసి వచ్చే ఇతర ఎంపీలను కలుపుకొని పోవాలని చెప్పారు. అదే సమయంలో భేటీకి అమిత్ షా హాజరవుతారని చెప్పారని, ఆయన ఎందుకు రాలేదని కూడా చంద్రబాబు ఆరా తీశారు. ఆయన ముందస్తు కార్యక్రమాల కారణంగా రాలేదని చెప్పినట్లు ఎంపీలు చంద్రబాబుకు చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS