బోని కపూర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంతే ? బంధువులతో శ్రీదేవి గోడు!

Filmibeat Telugu 2018-03-01

Views 1

Producer and director Satish Kaushik remembers Sridevi. Sridevi was enjoyed as mother says Sathish.

చిన్నతనం నుండి కష్టాన్నే నమ్ముకున్న శ్రీదేవి తన సంపాదనతో కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చింది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నో ఆస్తులు పోగేసింది. అయితే బోనీ కపూర్‌తో పెళ్లి తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే పెళ్లి తర్వాత ఆమె జీవితంలో ఆనందం మాయం అయింది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీదేవి బంధువులు బహిరంగంగా చెబుతున్న మాట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి అమ్మ తరుపు బంధువు, వరుసకు బాబాయ్ అయ్యే వేణుగోపాల్ రెడ్డి పలు సంచలన విషయాలు బయట పెట్టారు
శ్రీదేవి బాధ అంతా బోనీ అమ్మిన ఆస్తుల గురించే. చెన్నైలో ఉన్న ఇళ్లన్నీ అప్పులు కట్టడానికే అమ్మేశాడు. తన ఇద్దరు కూతుళ్లకు ఎట్లా అని బాధపడేది. శ్రీదేవి జీవితాంతం కష్టపడింది, కష్టపడుతూనే పోయింది. ప్రేక్షకులు నవ్వాలని మొహం మీద నవ్వు ఉంటుందే తప్ప ఆమె మనసులో చాలా బాధ ఉంటుంది అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.
మా వాళ్లు శ్రీదేవిని కలవడానికి పోయినపుడు తన కూతుళ్ల గురించి చాలా బాధ పడింది. బోనీ కపూర్ ఆరోగ్యం బావుండేది కాదు. షుగర్ 500పైనే ఉండేదని, ఆయన పరిస్థితి అలా తయారైందని బాధ పడేది. ఏదైనా అయితే నా బ్రతకు ఎట్లా, నా పిల్లల బ్రతుకు ఎట్లా అని బాధ పడింది..... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.
శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ, శ్రీదేవి గురించిన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. దర్శక నిర్మాత సతీష్ కౌశిక్ కూడా బోనికపూర్ ఫ్యామిలీకి సన్నిహితుడు. శ్రీదేవి మరణ వార్త తెలియగానే తాను దిగ్బ్రాంతి చెందిన విషయాన్ని తెలియజేసారు. శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
శ్రీదేవి మరణ వార్త తెలియగానే తాను రూమర్ అనుకున్నానని, అసలు నమ్మలేదని సతీష్ కౌశిక్ అన్నారు. నిజమని తెలిసాక దిగ్భ్రాంతి చెందానని కౌశిక్ అన్నారు
వెంటనే బోణి కపూర్ తో ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించానని సతీష్ కౌశిక్ తెలిపారు. ఫోన్ లో బోణి కపూర్ ఏడుపు తప్ప తనకు మరేం వినిపించలేదని అన్నారు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఏడుస్తూనే ఉన్నారు తప్ప మరేం మాట్లాడలేకపోయారని సతీష్ కౌశిక్ అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS